గుజరాత్‌లో రైలు ప్రమాదం జరిగింది. సూరత్ సమీపంలో దాదర్-పోర్‌బందర్ సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రైల్వే సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: MG Cyberster: సూపర్ కారు నుంచి ఫీచర్లు, ధర రివీల్.. లాంచ్ ఎప్పుడంటే..?
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అందరూ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు కిమ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుండగా లోకోమోటివ్ పక్కనే ఉన్న నాన్-ప్యాసింజర్ కోచ్ (VPU) నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందిన వెంటనే సీనియర్ రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక ప్రమాదం తర్వాత రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని చెప్పారు. అన్ని రైళ్లు యధావిథిగా నడుస్తున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: TTD: భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు