కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే బొనాంజా అందించబోతోంది.. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. ఈ నెలలోనే వేతన పెంపు ఉండనుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.. గత కొన్ని నెలల క్రితం ఉద్యోగులకు డిఏ పెరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ ఈ నెలలో డీఏ పెంచనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వ సమావేశం ఉండనుందని, అందులో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
గతంలో లాగే ఈసారి కూడా 4 శాతం జీతం పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ 42 శాతం వద్ద ఉంది. మరో 4 శాతం పెరిగితే 46 శాతానికి డీఏ పెరుగుతుంది.. కొన్ని నివేదికలు మాత్రం 3 శాతం అని ప్రచారం చేస్తున్నాయి.. మరికొన్ని మాత్రం 4 శాతం అని చెబుతున్నాయి.. అందువల్ల కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాతనే నిజంగా డీఏ ఎంత పెరిగిందో పూర్తిగా తెలుస్తుంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీ అనేది రూ.18 వేల నుంచి రూ. 56,900 వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బేసిక్ శాలరీ ఆధారంగా ఎంత పెరుగుతుందో చూడవచ్చు..
బేసిక్ శాలరీ పెరిగితే ఇప్పుడు జీతం కూడా భారీగా పెరగనుందని తెలుస్తుంది.. రూ. 56,900గా పరిగణలోకి తీసుకుంటే.. అప్పుడు నెలవారీ వేతనం రూ. 2276 మేర పెరగొచ్చు. అదే ఏడాదికి అయితే వేతన పెంపు రూ. 27,312గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతున్న విషయం తెలిసిందే.. జనవరి నుంచి జూన్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు డీఏ పెరగనుంది.. డీఏ పెరగడంతో జీతం కూడా భారీగా పెరుగుతుంది.. మరోవైపు 8 వేతనం పై కూడా పలు చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే..