NTV Telugu Site icon

Maharashtra Elections: 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. అందులో ప్రముఖుల పేర్లు

Maharashtra Elections

Maharashtra Elections

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. 99 మందితో తొలి లిస్ట్‌ని విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులోనే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోరు నెలకొంది. అధికార బీజేపీ నేతృత్వంలో ‘‘మహాయుతి’’ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి మధ్య పోటీ ఉంది. మహాయుతిలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు ఉండగా, ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్- ఠాక్రే శివసేన- శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మొత్తం 288 సీట్లలో బీజేపీ 151లో పోటీ చేస్తోంది. మిగిలిన సీట్లను శివసేన, ఎన్సీపీలు పంచుకుంటాయి.

Read Also: Pakistan : మా దగ్గర అన్ని రకాల అణు బాంబులు ఉన్నాయ్.. భారత్‌ను బెదిరించిన పాక్‌ అధికారి

మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఫడ్నవీస్ ఇక్కడి నుంచే పోటీలో ఉన్నారు. నాగ్‌పూర్ బీజేపీకి కంచుకోటగా ఉంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేకర్ బవాన్‌కులే నాగ్‌పూర్ జిల్లా కమ్తి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటివార్ బల్లార్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా, కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే కుమారుడు సంతోష్.. భోకర్దాన్ నుంచి బరిలోకి దిగారు. నాగ్‌పూర్ రీజియన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గెలుపొందారు.

భోకర్‌లో బిజెపి శ్రీజయ చవాన్‌ను పోటీకి దింపింది. ఈమె మాజీ మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్ కుమార్తె. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. కన్కావ్లీ నుంచి మాజీ కేంద్రమంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితీస్ రాణే పోటీ చేస్తున్నారు. బీజేపీ తొలిజాబితాలో 13 మంది మహిళా అభ్యర్థులు.. ఎస్సీ వర్గానికి చెందిన నలుగురు, ఎస్టీ వర్గానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు.

Show comments