NTV Telugu Site icon

Maha Kumbh Mela: మహా కుంభమేళలో సిలిండర్ పేలుడు.. భారీ అగ్నిప్రమాదం..

Mahaakumbh

Mahaakumbh

Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు పరుగులు తీశారు. అనేక అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మండలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఒక క్యాంప్ సైట్‌లో మంటలు చెలరేగాయి, తర్వాత ఇవి పక్కనే ఉన్న ఇతర టెంట్లకు వ్యాపించాయి. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక అధికారులకు సహాయం చేయడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలుడు వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.