NTV Telugu Site icon

Asna Cyclone: దూసుకొస్తున్న అస్నా తుఫాను.. గుజరాత్‌కు ఐఎండీ హెచ్చరికలు

Asnacyclone

Asnacyclone

అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అది కాస్తా తుఫాన్‌గా మారింది. 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గుజరాత్‌కి 250 కి.మీ, పాకిస్థాన్‌కి 160 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది.

ఇది కూడా చదవండి: Bandla Ganesh: ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి!

అస్నా తుఫాన్‌ గుజరాత్‌పై ప్రభావం చూపించవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా తీరంలో
ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ గుజరాత్‌లోని భరూచ్, సూరత్, డాంగ్, తాపి, నవ్సారి, వల్సాద్ మరియు డామన్, దాదరా నగర్ హవేలీ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Bangladesh-India: షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు.. బంగ్లాదేశ్కు అప్పగించాలి.

ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు, బైకులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇక నదుల్లోంచి మొసళ్లు జనావాసాల దగ్గరకు కొట్టుకొచ్చాయి. ఇళ్లు బురదతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Show comments