Site icon NTV Telugu

మోడీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌

ప్రధాని మోడీ ట్విట్టర్‌ ఖాతాను సైతం సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. కొంత సమయం వరకు హ్యాక్‌ అయింది.ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. అయితే కొంత సేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో దుండగులు బిట్‌ కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టులు చేశారు. భారత ప్రభుత్వం 500 బిట్‌ కాయిన్‌లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతున్నారని హ్యకర్లు వాటికి సంబంధించిన లింక్‌లను పోస్ట్‌ చేశారు.

దీంతో వెంటనే పీఎంవో అధికారులు స్పందించి ట్విట్టర్‌ దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్లారు. వెంటనే ఆ ట్విట్‌ను తొలగించారు. అనంతరం ట్విట్టర్‌ ఖాతాను పునరుద్ధరించారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. ట్విట్టర్‌ వెంటనే ఖాతాను పునరుద్ధరించడంతోపాటు రక్షణ కల్పించనున్నట్టు తెలిపిందని పీఎంవో అధికార వర్గాలు వెల్లడించాయి.

Exit mobile version