దేశంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులు సైబర్ వలలో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో కోట్లాది రూపాయలు పోగొట్టుకుని లబోదిబో అంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో చోటుచేసుకుంది. దాదాపు రూ.9 కోట్లు సమర్పించుకున్నాడు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ముంబైకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఏప్రిల్ 2023లో ఫేస్‌బుక్‌లో షార్వి అనే మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ రిక్వెస్ట్ తిరస్కరణకు గురైంది. కొన్ని రోజుల తర్వాత షార్వి ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆశగా ఎదురు చూస్తున్న ఆ వృద్ధుడు అంగీకరించాడు. ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తన భర్త నుంచి దూరమై పిల్లలతో ఉన్నట్లు ఆవేదన చెప్పుకుంది. ప్రస్తుతం తన పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. తనకు కొంత డబ్బు అవసరం అని కోరింది. దీంతో ఆ వృద్ధుడు కరిగిపోయి డబ్బు పంపించాడు.
ఇది కూడా చదవండి: Breastfeeding-benefits : డెలివరీ తర్వాత చనుబాలు ఇస్తే బరువు తగ్గుతారా? వైద్యులు ఏం అంటున్నారంటే..
ఇలా నడుస్తుండగా కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించింది. షార్వి స్నేహితురాలిగా పరిచయం చేసుకుంది. అలా అతడికి అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించింది. అనంతరం డబ్బు అడగడం మొదలుపెట్టింది.
ఇలా ఇద్దరు మహిళలు కథ నడిపిస్తుండగానే.. షార్వి సోదరి నంటూ మరో మహిళా దివాజ్ సందేశాలు పంపించడం మొదలు పెట్టింది. షార్వి చనిపోయిందని.. ఆస్పత్రి బిల్లు చెల్లించాలని స్క్రీన్‌షాట్‌లు పంపించింది. దీంతో ఆ వృద్ధుడు డబ్బులు పంపించాడు. తిరిగి దినాజ్ దగ్గర డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇంతలోనే జాస్మిన్ అనే మహిళ మెసేజ్ పంపించింది. దినాజ్ స్నేహితురాలినని సహాయం చేయాలని కోరింది. దీంతో ఆమెకు కూడా డబ్బు పంపించాడు. ఇలా ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు 734 లావాదేవీలకు గాను రూ. 8.7 కోట్లు చెల్లించాడు. ఇక ఖాతాలో డబ్బు అయిపోవడంతో కోడలి దగ్గర రూ.2లక్షలు అప్పుతీసుకున్నాడు. అయినా మహిళల నుంచి మరింత డిమాండ్లు పెరగడంతో కొడుకు దగ్గర రూ.5లక్షలు అడిగాడు. అనుమానం వచ్చి తనయుడు నిలదీయగా బండారం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు.
అనుమానం వచ్చిన కొడుకు తండ్రిని నిలదీశాడు. దీంతో జూలై 22న సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడిని మోసం చేసిన నలుగురు మహిళలు తెలిసిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
