Site icon NTV Telugu

CWC Meeting: పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ మీటింగ్.. ఓట్ల చోరీ.. ఎన్నికల వ్యూహంపై చర్చ

Bihar

Bihar

బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: Typhoon Ragasa: తైవాన్‌, చైనాలో తుఫాన్ విధ్వంసం.. 17 మంది మృతి

స్వాతంత్య్రానంతర కాలంలో బీహార్‌లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు దీపా దాస్ మున్షీ, సయీద్ నాసిర్ హుస్సేన్ సహా అగ్ర కాంగ్రెస్ నాయకుంతా ఈ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్, మెలానియాకు అవమానం! సడన్‌గా ఆగిన యూఎన్ ఎస్కలేటర్ రైడ్‌.. వైట్‌హౌస్ సీరియస్

బుధవారం పాట్నాలో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ‘‘ఓట్ల చోరీ’, ట్రంప్ సుంకాలు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అంశాలపై చర్చించే అవకాశం ఉందని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తెలిపారు.

ఈ సమావేశాలకు కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు (శాసన సభ, శాసన మండలి పక్ష నేతలు), సీఈసీ సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వంశీ చంద్ రెడ్డి హాజరవుతుండగా… ఇక ఏపీ నుంచి షర్మిలా రెడ్డి, రఘువీరా రెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొంటున్నారు.

Exit mobile version