Site icon NTV Telugu

Air Guns : లక్నో ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ గన్స్ కలకలం

Airguns At Lucknow Airport

Airguns At Lucknow Airport

Air Guns: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ గన్స్ కలకలం రేపాయి. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 10 ఫారిన్ మేడ్ ఎయిర్ గన్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి లగేజ్ బ్యాగ్‌లో విదేశీ ఎయిర్ గన్స్ దాచి ఓ ప్రయాణీకుడు తరలించే యత్నం చేశాడు.

కానీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో ఈ ఎయిర్‌గన్స్ వ్యవహారం పట్టుబడింది. ఎయిర్ గన్స్‌తో పాటు టెలిస్కోప్స్‌ను కూడా కస్టమ్స్ బృందం సీజ్ చేసింది. ప్రయాణీకుడిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏమైనా ఆయుధాలు సరఫరా చేశాడా అని ఆరా తీస్తున్నారు. ఆ ఆయుధాల విలువ రూ.20.54
లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు ఎలాంటి డిక్లరేషన్, చట్టబద్ధమైన పత్రాలు లేకుండా గ్రీన్ ఛానల్ గుండా వెళ్లడానికి ప్రయత్నించాడని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Google Play Store : స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు శుభవార్త.. ప్లే స్టోర్‌ కీలక నిర్ణయం..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 తుపాకులతో థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ఓ జంటను అరెస్ట్ చేసిన ఆరు రోజుల తర్వాత.. లక్నోలో మంగళవారం మరో ప్రయాణికుడిని నుంచి 10ఎయిర్‌గన్స్ స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

 

Exit mobile version