Site icon NTV Telugu

సీఎం ఇంటిపై బాంబు దాడి… క‌ర్ఫ్యూ విధింపు…ఇంటర్నెట్ నిలిపివేత‌…

దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగ‌స్టు 15  వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగంగా నిర్వ‌హించుకుంటుంటే, మేఘాల‌య రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అల‌జ‌డులు జ‌రిగాయి.  మేఘాల‌య రాజ‌ధాని షిల్లాంగ్‌లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి.  నేష‌న‌ల్ లిబ‌రేష‌న‌ల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌కౌంట‌ర్‌తో ఒక్క‌సారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది.  ఆందోళ‌న కారులు రోడ్ల‌పైకి వ‌చ్చి వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు.  ఇటీవ‌లే లైతుంఖ్రా వ‌ద్ద జ‌రిగిన బాంబు దాడుల్లో థాంగ్‌కీ హ‌స్తం ఉంద‌నే అనుమానాలు క‌ల‌గ‌డంతో ఆయ‌న్న ప్ర‌శ్నించేందుకు పోలీసులు, అధికారులు ఆయ‌న ఇండికి వెళ్లారు.  అయితే, థాంగ్‌కీ పోలీసుల‌పై క‌త్తితో దాడి చేయ‌డంతో పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేశారు.  ఈ దాడి త‌రువాత షిల్లాంగ్ అట్టుడికిపోయింది.  కొంత‌మంది ఆందోళ‌న కారులు సీఎం క‌న్రాడ్ సంగ్మా ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు.  అయితే, ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.  షిల్లాంగ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ హోంశాఖ మంత్రి ల‌క్మెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.  ఇక షిల్లాంగ్‌లో ఆదివారం రాత్రి 8 గంట‌ల నుంచి మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధించ‌గా, నాలుగు జిల్లాల్లో ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాన్ని నిపిపివేస్తు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  

Read: “పుష్ప” వీడియో లీక్… పోలీసులను ఆశ్రయించిన మైత్రి నిర్మాతలు

Exit mobile version