JK: జమ్మూ కాశ్మీర్‌లో విషాదం.. లోయలో పడ్డ బస్సు.. ముగ్గురు జవాన్లు మృతి

  • జమ్మూ కాశ్మీర్‌లో విషాదం
  • లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు జవాన్లు మృతి
Jkaccident

Jkaccident

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 మంది సిబ్బందితో వెళ్తున్న బస్సు లోయలోకి పడిపోయింది. దీంతో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Satavahana College: మరోసారి తెరపైకి శాతవాహన కాలేజీ వివాదం.. టీడీపీ ఎమ్మెల్సీపై ప్రిన్సిపాల్ ఫైర్!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో సీఆర్‌పీఎఫ్ వాహనం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ ఉధంపూర్ సందీప్ భట్ ప్రకారం.. పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్ల చెప్పారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.