NTV Telugu Site icon

Bhopal Crime: బాలున్ని మొసలి మింగింద‌ని.. గ్రామ‌స్తులు ఏంచేసారంటే..

Crocodaile

Crocodaile

న‌దిలో స్నానానికి ఓ బాలుడు వెల్లాడు.. కానీ కొద్ది స‌మ‌యంలోనే క‌నిపించ‌లేదు. దీంతో స్నేహితులు భ‌యంతో.. ప‌రుగులు పెట్టి ఆవార్త‌ను గ్రామ‌స్తుల‌కు తెలిపారు. దీంతో గ్రామ‌స్తులు వ‌చ్చి న‌దిలో వున్న మొస‌లి బాలున్ని మింగింద‌నే అనుమానంతో దాన్ని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసారు. ఈ ఘ‌ట‌న మధ్య ప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా రిఝెంటా గ్రామంలో చోటుచేసుకుంది.

read also: Supreme Court: అగ్నిపథ్‌పై పిటిషన్లు.. ఈ నెల 15న విచారించనున్న సుప్రీంకోర్టు

వివ‌రాల్లోకి వెలితే.. రిఝెంటా గ్రామానికి చెందిన అతర్ సింగ్ అనే పదేళ్ల బాలుడు చంబల్ నదిలో స్నానానికి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో.. నదిలోని మొసలి బాలుడ్ని మింగేసిందని గ్రామస్థులంతా అనుకున్నారు. అక్క‌డే వున్న‌వలను తీసుకువ‌చ్చి ఆ మకరాన్ని పట్టుకుని, ఒడ్డుకు లాక్కొచ్చి తాళ్లతో కట్టేశారు. ఆమొస‌లి క‌డుపులో బాలుడు సజీవంగా ఉన్నాడని.. ఎలాగైనా బయటకు కక్కేలా చేయాలని భావించిన గ్రామ‌స్తులు మొస‌లి క‌డుపు లోపల ఉన్న బాలుడికి ఆక్సిజన్​ అందడం కోసం.. మొసలి నోరు తెరిచే ఉంచేలా పెద్ద కర్ర పెట్టారు. అంతేకాకుండా.. మకరం పొట్ట చీల్చి.. బాలుడ్ని బయటకు లాగాల్సిందేనని మరికొందరు స‌ల‌హా ఇవ్వ‌డం. కాగా.. ఈ తతంగం అనేక గంటలపాటు సాగింది.. అయితే.. గ్రామ ప్రజలంతా ఎవరికి తోచింది వాళ్లు చేస్తూ, మొసలిని చిత్రహింసలు పెట్టారు. ఈనేప‌థ్యంలో.. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్క‌డున్న వారిని, గ్రామస్థులకు నచ్చజెప్పి, మొసలికి విడిపించి, తిరిగి నదిలో విడిచిపెట్టారు. అయితే మ‌రి బాలుడు ఏమైన‌ట్లు అంటూ నదిలో గాలించగా.. శవమై కనిపించాడు. అయితే.. బాలుడి శరీరంపై గాయాలు ఉండ‌టంతో మృతికి కారణమేంటో పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే.. అనురాగ్ ద్వారీ అనే అత‌ను దీనికి సంబందించిన వీడియోను ట్విట‌ర్ పోస్ట్ చేయ‌గా.. ఈఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.