NTV Telugu Site icon

Delhi: రాష్ట్రపతిని కలిసిన సచిన్ టెండూల్కర్ దంపతులు

Droupadi Murmu

Droupadi Murmu

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సచిన్ టెండ్కూలర్ దంపతులు కలిశారు. సచిన్ టెండూల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలి టెండూల్కర్, కుమార్తె సారా టెండూల్కర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సంతకం చేసిన టెస్ట్ జెర్సీని సచిన్ అందజేశారు. అంతకముందు రాష్ట్రపతి భవన్‌లో సచిన్‌తో కలిసి ద్రౌపది ముర్ము వాకింగ్ చేస్తూ సంభాషించారు. రాష్ట్రపతి మాట్లాడుతుండగా.. సచిన్ సమాధానం ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.