దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైలులు ఇద్దరు లవర్స్ రచ్చరచ్చ చేశారు. వారిద్దరూ మెట్రో రైలులో సరదాగా ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారిద్దరి మధ్య టీ షర్ట్ ధరపై వాగ్వాదం మొదలైంది. ఆమె తాను వేసుకున్న టీషర్టును వేయి రూపాయలకు కొన్నానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు సరదాగా ఆ టీ షర్టు 150 రూపాయలకే దొరుకుతుందని సరదాగా చెప్పాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయి అతని చెంప చెల్లుమనిపించింది. ఒక్కసారిగా సీరియర్ అయిన ఆమె అతడిని బాగా కొట్టింది. ఈ క్రమంలో మా అమ్మకు చెబుతాను అంటూ బుంగమూతి పెట్టి చెప్పగా.. ఆ యువకుడు నీ లాంటి లవర్ ఎవరికీ ఉండొద్దంటూ బదులిచ్చాడు.
దీంతో మరీ రెచ్చిపోయిన ఆ యువతి మరోసారి యువకుడిని బాగా బాదింది. దీంతో కోపోద్రీకుడైన యువకుడు ఆమె చెంప చెల్లుమనిపించాడు. అనంతంరం ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ స్టేషన్ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. వారి చేష్టలకు మెట్రో రైలులోని ప్రయాణికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Delhi metro entertainment 😂😂pic.twitter.com/LLdIDHB54N
— Kartik sharma (@Kartik_sharmaji) July 12, 2022
