Site icon NTV Telugu

ఈయూలో సీరం ఇనిస్టిట్యూట్‌కు ఎదురుదెబ్బ‌…

ఆక్స్‌ఫ‌ర్ట్-అస్త్రాజెన‌కా సంయుక్తంగా అభివృద్దిచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  ఇప్ప‌టికే ఈ వ్యాక్సిన్‌ను అనేక దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ది.  ఇక ఇదిలా ఉంటే, జులై 1 వ తేదీ నుంచి ఈయూ గ్రీన్ పాస్‌ల‌ను జారీ చేయ‌బోతున్న‌ది.  గ్రీన్ పాస్‌ల‌కు అర్హ‌త క‌లిగిన వాటిల్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరు లేక‌పోవ‌డంతో సీరం సంస్థ షాక్ అయింది.  దీంతో ఈయూలో ప్ర‌యాణం చేసే భార‌తీయుల‌కు గ్రీన్ పాస్ ల‌భించే అవ‌కాశం ఉండ‌దు.  దీంతో భార‌తీయులు ఇబ్బందిప‌డే అవ‌కాశం ఉంటుంది.  దీంతో సీరం సంస్థ సీఈవో అధ‌ర్ పూనావాలా రంగంలోకి దిగారు.  యూరోపియ‌న్ యూనియ‌న్ స‌భ్య‌దేశాల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, భార‌తీయుల‌కు ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని అన్నారు.  

Read: కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…!

Exit mobile version