Site icon NTV Telugu

Covid 19: వ్యాక్సినేషన్‌లో మరింత స్పీడ్.. పిల్లలకు, పెద్దలకు..

Vaccination

ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.. ఇక, భారత దేశవ్యాప్తంగా మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త టీకా 12నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. అయితే పిల్లలకు కార్బివాక్స్ వ్యాక్సిన్ మాత్రమే వేయనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషన్ ఆదేశాలు పంపారు.

Read Also: Punjab: నేడు భగవంత్ మాన్ ప్రమాణం.. భగత్‌ సింగ్‌ జన్మస్థలంలో కార్యక్రమం..

కార్బివాక్స్.. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు అందిస్తారు. 2010 అంతకంటే ముందు జన్మించిన పిల్లలు ఈ టీకా తీసుకునేందుకు అర్హులని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. టీకా కోసం పిల్లల పేర్లను ఆన్‌లైన్‌లో కోవిన్ యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. లేదా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. అధికారిక అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల గ్రూప్ పిల్లలు 7.11 కోట్ల మంది ఉన్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 5 కోట్ల డోసుల కార్బివ్యాక్స్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ టీకాలు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ అయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే టీకా ఇచ్చేందుకు ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలకు టీకాలను పంపటంతో పాటు.. ఆయా జిల్లాల డీఎంహెచ్​ఓలు, వ్యాక్సినేటర్లకు టీకా పంపిణీకి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి కూడా నేటి నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనున్నారు.

Exit mobile version