Site icon NTV Telugu

COVID subvariant JN.1: కేరళలో కొత్త వేరియంట్ కలకలం.. వెలుగులోకి JN.1 వేరియంట్..

Covid 19

Covid 19

COVID subvariant JN.1: దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోంది. తాజాగా కేరళలో కొత్తగా కోవిడ్ సబ్‌వేరియంట్ వెలుగులోకి వచ్చింది. JN.1 సబ్‌వేరియంట్‌ని కనుగొన్నారు. చైనాలో కేసులకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ని తొలిసారిగా కేరళలో గుర్తించారు. JN.1 సబ్‌వేరియంట్, BA.2.86 వేరియంట్‌గా కూడా పిలుస్తారు. మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలతో ఇది కనుగొనబడింది.

ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది. COVID-19 సబ్-వేరియంట్ JN.1 కేసు డిసెంబర్ 8న కేరళలో కనుగొనబడింది. 79 ఏళ్ల మహిళ శాంపిళ్లను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మానవుడి రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. టాలీవుడ్ నుంచి చిరంజీవికి ఆహ్వానం?

ఇంతకముందు సింగపూర్ దేశంలో ఒక భారతీయ టూరిస్ట్‌కి కూడా JN.1 సబ్-వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిలో దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత దేశంలో మరెక్కడా కూడా ఈ వేరియంట్ కనిపించలేదు. తాజాగా కేరళలో వెలుగులోకి రావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.

కోవిడ్-19 వేరియంట్ BA.2.86కి JN.1 సబ్ వేరియంట్. ఈ వేరియంట్ ద్వారా ఇప్పటి వరకు ఆస్పత్రిలో చేరడం, తీవ్రమైన అనారోగ్యానికి గురికాలేదని INSACOG చీఫ్, NK అరోరా చెప్పారు. దాదాపుగా ఏడు నెలల అనంతరం భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నా్యి. ఇప్పటికే పలు పాశ్చాత్య దేశాల్లో JN.1 వ్యాప్తి పెరుగుతోంది.

Exit mobile version