భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. వందల్లోకి వచ్చాయి.. అయితే, ఇప్పుడు మళ్లీ టెన్షన్ పెట్టే విధంగా వేలలోకి వెళ్తున్నాయి.. కరోనా కేసులు పెరుగుతుండటంతో… మరోసారి ఆంక్షల వైపు ఢిల్లీలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోజు వారి కేసులు సంఖ్య రెట్టింపవుతోంది. వైరస్ ఎఫెక్ట్ తీవ్రంగా లేక పోయినప్పటికీ… ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవు. మాస్కుల వినియోగం తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి రోజూ 5వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇవాళ సమావేశం కానుంది. మాస్క్ వాడకంతో పాటు కరోనా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రకటించనుంది డీడీఎంఏ.
Read Also: Troubles to TRS: అధికార పార్టీకి తలనొప్పులు..! ఇబ్బందిగా ఆ మూడు ఘటనలు..!
వాక్సినేషన్ జరుగుతుండటంతో… కరోనా ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఏ వేరియంట్ ఎలా ఉంటుందోననే టెన్షన్ పడుతున్నారు. అందుకే వేరియంట్ ఏదైనా కరోనా జాగ్రత్తల విషయంలో లైట్ తీసుకోవద్దని డిసైడ్ అయింది ఢిల్లీ సర్కార్. ఇప్పటికే స్కూళ్లలో పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ లక్షణాలున్న స్టూడెంట్స్ ను స్కూళ్లకు పంపొద్దని తల్లిదండ్రులను కోరుతున్నారు. కోవిడ్ సోకినవారిలో అధికశాతం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మాస్కులు ధరించకపోవడమే కేసుల పెరుగుదలకు అసలు కారణమని అంచనా వేస్తున్నారు. కోవిడ్ సోకినవారు… 5 రోజుల్లో కోలుకుంటున్నట్లు తేలింది. కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు పలు శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 30శాతం మందిలో దీర్ఘకాలిక కొవిడ్ వెంటాడుతున్నట్లు తాజా అధ్యయనం తేలింది. ఇన్‌ఫెక్షన్ బారినపడిన నుంచి నెలల తరబడి కొన్ని లక్షణాలు వారిని వేధిస్తున్నాయని తెలిపింది. కోవిడ్ సోకిన తర్వాత ప్రభావాలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.. మళ్లీ ఆంక్షాల బాట పడుతుండడంతో.. ఎలాంటి ఆంక్షలు విధించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
