లాక్‌డౌన్ కాలంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిత్యం వినియోగదారులతో కళకళలాడే షాపింగ్ మాల్స్ లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. నష్టాలను పూడ్చుకునేందుకు మాల్స్ తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటు వస్తున్నది. ఒక్క బెంగళూరు నగరంలోనే కరోనా కాలంలో లక్షమందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో షాపింగ్ సెంటర్స్ అసోసియోషన్ కర్ణాటక సీఎం యడ్యూరప్పకు లేఖ రాసింది. గుజరాత్ ప్రభుత్వం నష్టపోయిన షాపింగ్ సెంటర్లకు రాయితీలు కల్పించిందని, కర్ణాటక ప్రభుత్వం కూడా రాయితీలు కల్పించి అదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
లాక్‌డౌన్ కాలంలో ఒక్క బెంళూరులోనే…లక్షకుపైగా…
Show comments