మనిషి దగ్గినపుడు, తుమ్మినపుడు నోటి నుంచి తుంపర్లు గాల్లోకి వెలువడతాయి. కరోనా సోకిన వ్యక్తి శరీరంలో కరోనా ఉంటే అది ముక్కు, నోటిద్వారా బయటకు వస్తుంటాయి. అక్కడి నుంచి మరోకరికి సోకుతుంటాయి. అయితే, పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు సరికొత్త విషయాలను గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి కంటి నుంచి వచ్చే కన్నీటిలో కూడా కరోనా వైరస్ ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 120 మంది రోగులపై చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కరోనాకు ట్రీట్మెంట్ చేసే వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, కన్నీటి నుంచి కంటే నోటీ తుంపర్లద్వారాలే వైరస్ ఎక్కువగా స్పెడ్ అవుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.
Read: భారీ ధరకు అమ్ముడైన “రాపో19” ఆడియో రైట్స్