Site icon NTV Telugu

ఇండియా క‌రోనా అప్డేడ్ః 40 వేల దిగువ‌కు కేసులు…

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ సంఖ్య‌లో  కేసులు న‌మోద‌వ్వ‌గా, మే చివ‌రి వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.  తాజాగా, కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  దీని ప్ర‌కారం, ఇండియాలో కొత్త‌గా 39,796 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,05,85,229 కి చేరింది.  ఇందులో 2,97,00,430 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,82,071యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 723 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 4,02,728కి చేరింది. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 35,28,92,046 మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  

Read: ‘ఫేవరెట్ టీం’ అంటూ వాళ్ళతో మెహ్రీన్… పిక్ వైరల్

Exit mobile version