భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. ఈ సీజన్ ఓ దశలో 20 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసిన రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు మళ్లీ కిందకు దిగివస్తుంది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 25 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 16,113 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం దేశ్యాప్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య 1,43,654గా ఉంది.. రికవరీ కేసుల సంఖ్య 98.47 శాతానికి చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది. ఇక, ఇప్పటి వరకు దేశ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,83,062కు చేరింది.. 5,25,785 మంది కోవిడ్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,43,654కా ఉంటే.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4,31,13,623గా ఉంది.. మరోవైపు.. దేశ్యాప్తంగా సోమవారం వరకు 200.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు..
COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

Covid 19