Site icon NTV Telugu

కేరళలో అదుపులోకిరాని కరోనా… భయాందోళనలో ప్రజలు…

దేశంలో మ‌రోసారి కేసులు భారీగా న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో 46 వేల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి.  ఒక్క‌సారిగా 11 వేల‌కు పైగా కేసులు పెర‌గ‌డంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  న‌మోదైన 46,164 కేసుల్లో ఒక్క కేర‌ళ రాష్ట్రంలోనే 31,445 కేసులు న‌మోద‌య్యాయి.  ప్ర‌తిరోజూ కేర‌ళ‌లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  పెద్ద సంఖ్య‌లో వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న‌ప్ప‌టికీ కేసులు పెరుగుతుండడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉండ‌టంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.  

Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

Exit mobile version