Site icon NTV Telugu

Covid-19: 4 వేలపైగా కరోనా కేసులు.. 24 గంటల్లో ఐదుగురు మృతి

Covidcase

Covidcase

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం అంతంత మాత్రంగా ఉన్న కేసులు ఈ వారంలో అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే మరణాలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4, 026 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. ఇక కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో మంగళవారం ఉదయం 8 గంటలలోపు ఐదుగురు చనిపోయారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Rohit Sharma: నా దగ్గర బ్యాట్‌లు లేవు.. ఆరు దొబ్బేశారు! వీడియో వైరల్

కేరళలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ వ్యాధితో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇక మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయారు. 70, 73 ఏళ్ల మహిళలు డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో ఉన్న రోగులు చనిపోయారని పేర్కొన్నారు. ఇక తమిళనాడులో 69 మహిళ ఏళ్ల పార్కిన్సన్స్ వ్యాధి చనిపోయింది. పశ్చిమ బెంగాల్‌లో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ

కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. కానీ తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం వంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేసులు సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడొద్దని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇంకోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలను కూడా ముమ్మరం చేశాయి. దేశ వ్యాప్తంగా ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి. బెడ్‌ల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వనరులపై అప్రమత్తం చేశాయి. కోవిడ్ సంబంధిత ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ హామీ ఇచ్చారు.

Exit mobile version