NTV Telugu Site icon

కరోనా కట్టడికి చర్యలు.. ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

VK Paul

VK Paul

కరోనా కట్టడి చర్యల కోసం కేంద్రం… 6 రాష్ట్రాలకు మల్టీ డిసిప్లినరీ బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తెలిపింది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మణిపూర్‌ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లాయి. కరోనా కట్టడిని తీసుకుంటున్న చర్యలను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. ముఖ్యంగా నిఘా, కరోనా నిరోధక చర్యలు, పరీక్షలు, కోవిడ్ నిబంధనావళి అమలు, ఆసుపత్రి పడకలు, అంబులెన్స్, వెంటిలేటర్లు, మెడికల్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలను సమీక్షిస్తారని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాగా, కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నా.. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఆందోళన కర రీతిలో కేసులు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగిసిపోలేదని కూడా కేంద్రం చెబుతూనే ఉంది. కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తోంది.