కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. కరోనాకు ముందు కళకళలాడిన హోటల్ రంగం కోవిడ్ ఎంటర్ కావడంతో కుదేలయింది. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు వంటి నగరాల్లో కూడా హోటల్ రంగం కుదేలయింది. బెంగళూరు నగరంలో 25 వేలకు పైగా హోటళ్లు ఉండగా 2500 హోటళ్లు అమ్మకానికి ఉన్నట్టు హోటల్ అసోసియోషన్ తెలియజేసింది. కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 70 వేలకు పైగా రిజిస్ట్రేషన్ హోటళ్లు ఉండగా, అందులో 10వేలకు పైగా హోటళ్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, కొంతమంది హోటల్ యాజమాన్యం హోటళ్లను తెరిచేందుకు సిద్దంగా లేరని హోటల్ అసోసియోషన్ తెలిపింది.
Read: జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ‘దక్షిణ’
