Site icon NTV Telugu

క‌రోనా తీవ్ర‌త వీటిని బట్టే ఉంటుందా?

క‌రోనా కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త పూర్తిగా త‌గ్గిపోలేదు.  క‌రోనా బారిన ప‌డిన వ్య‌క్తులు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్న‌వారి సంఖ్య అధికంగా ఉన్న‌ది.  ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న వారిలో అనేక అనుమానాలు క‌లుగుతుంటాయి.  క‌రోనా నుంచి కోలుకుంటామా? ఈ జ‌బ్బు తగ్గుతుందా లేదా అని తెలుసుకోవ‌డం ఎలా అనే సందేహాలు కామ‌న్ గా వ‌స్తుంటాయి.  క‌రోనా తీవ్ర‌త రెండు విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

Read: బీజేపీకి శివ‌సేన ద‌గ్గ‌ర‌వుతుందా? ఫ‌డ్నవిస్ వ్యాఖ్య‌ల‌కు అర్ధం అదేనా?

ఒక‌టి శ్వాస త్వ‌ర‌త్వ‌ర‌గా తీసుకోవ‌డం, రెండోది ఆక్సీజ‌న్ 91 శాతం కంటే త‌క్కువ‌కు ప‌డిపోవ‌డం.  క‌రోనా తీవ్ర‌త‌ను అంచ‌నా వేయ‌డానికి ఈ రెండు కీల‌క‌మ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డుతూ, ఉశ్చ్వాస‌, నిశ్చ్వాస‌లు వేగంగా జ‌రుగుతుంటే వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లాలి.  ఆక్సీజ‌న్ 91 శాతం కంటే త‌క్కువ‌గా న‌మోదైతే ప్ర‌మాద‌మ‌ని చెప్పొచ్చు. ఇలాంటి స‌మ‌యాల్లో ఆల‌స్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాద‌మ‌ని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

Exit mobile version