NTV Telugu Site icon

Booster Dose: బూస్టర్‌ డోస్‌పై కేంద్రం కీలక సూచనలు..

Booster Dose

Booster Dose

వివిధ రూపాల్లో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఫస్ట్‌ డోస్‌, సెకండ్‌ డోస్‌ పెద్ద సంఖ్యలో తీసుకున్నా.. బూస్టర్‌ డోస్‌ వేసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడంలేనట్టుగా తెలుస్తోంది.. అయితే, దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా వీలైనంత తొందరగా బూస్టర్‌ డోసులు తీసుకోవాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా సూచించారు. ముందుగా తీసుకున్న వ్యాక్సిన్‌ల నుంచి పొందిన యాంటీబాడీలు ఆరు నుంచి ఎనిమిది నెలల్లో తగ్గిపోతుండటంతో వీలైనంత తొందరగా ప్రికాషనరీ డోసు తీసుకోవాలని స్పష్టం చేశారు డాక్టర్‌ ఎన్‌కే అరోరా..

Read Also: LPG Cylinder Price: గుడ్‌న్యూస్‌.. రూ.91.5 తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

వివిధ రకాల వైరస్‌లతోపాటు కొవిడ్‌-19 కూడా వ్యాప్తిలో ఉందని…. అదృష్టవశాత్తూ అది ప్రభావాన్ని చూపించడంలేదన్నారు. అయినప్పటికీ కరోనాతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఆస్పత్రి పాలైన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్‌ తీసుకోని వారేనని ఎన్‌కే అరోరా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించిన డాక్టర్‌ ఎన్‌కే అరోరా.. భవిష్యత్తులో మన ఆరోగ్యానికి అది ఇన్సూరెన్స్‌గా పనిచేస్తాయని అన్నారు. కాగా, భారత్‌లో మరోసారి భారీ సంఖ్యలో నమోదవుతూ వచ్చిన రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య.. 20 వేలకు పైగా నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ, సిటీ ఆసుపత్రులలో కోవిడ్ -19 రోగులలో 90 శాతం మందికి రెట్టింపు టీకాలు వేయబడ్డాయి మరియు 10 శాతం మంది మాత్రమే ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బూస్టర్ డోస్‌లకు అర్హత పొందిన మొదటి సమూహం వారి వయస్సు లేదా పనిని బట్టి ఎక్కువ ప్రమాదం ఉందని అంచనా వేయబడింది. ఇక, భారతదేశంలో ఇప్పటికే కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క 100 మిలియన్లకు పైగా బూస్టర్ డోస్‌లను అందించింది. . భారతదేశం జనవరి 10 నుండి బూస్టర్ మోతాదును అందించడం ప్రారంభించింది. అయితే, ఇటీవలి నివేదిక ప్రకారం, 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మరియు అర్హత ఉన్న జనాభాలో కేవలం 12 శాతం మంది మాత్రమే ఈ రోజు వరకు కోవిడ్-19 టీకా యొక్క ముందు జాగ్రత్త మోతాదును పొందారు.

Show comments