NTV Telugu Site icon

నవంబర్‌లో చిన్నారులకు వ్యాక్సినేషన్‌..!

vaccination

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పడుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయాలు మాత్రం వెంటాడుతున్నాయి.. అయితే, దేశంలో అక్టోబర్ చివరి నాటికి చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి రెండేళ్లు పైబ‌డిన వయసు క‌లిగిన‌ పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి… థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌పై క‌రోనా అధికంగా ప్రభావం చూపుతుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. పిల్లలపై కోవ్యాక్సిన్‌ ట్రయ‌ల్స్‌ను భారత్ బయోటెక్ ప్రారంభించిందని ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. చిన్నారుల‌పై కోవిడ్ టీకా ట్రయ‌ల్స్ పూర్తికావ‌డానికి నాలుగు నుంచి నాలుగున్నర నెలలు పట్టే ఛాన్స్ ఉంది. నవంబరులో చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.