Site icon NTV Telugu

Prajwal Revanna: లైంగిక దాడి కేసులో కీలక తీర్పు.. ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు

Prajwal Revanna

Prajwal Revanna

లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక శనివారం బెంగళూరులోని ఎంపీలు/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష ఖరారు చేయనుంది.

రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మహిళ గత ఏడాది ఏప్రిల్‌లో మాజీ ఎంపీపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి రేవణ్ణ తనపై పదే పదే అత్యాచారం చేశాడని.. ఎవరికైనా చెబితే వీడియోలను విడుదల చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది మే 31న అరెస్టు చేశారు. ఇక 2 వేలకు పైగా అశ్లీల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్‌కుమార్‌కు షాక్!.. బీజేపీ సీఎం అభ్యర్థిని ఫోకస్ చేసే యోచనలో అధిష్టానం!

14 నెలల విచారణలో 23 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. 123 ఆధారాలతో కూడిన 2,000 పేజీల ఛార్జ్ షీట్‌ను సీఐడీ సిట్ సమర్పించింది. ఆరోపణలు నిజం కావడంతో శుక్రవారం ప్రత్యేక కోర్టు రేవణ్ణను దోషిగా నిర్ధారించింది. విచారణ సమయంలో బాధితురాలు తన చీరను భౌతికంగా చూపించింది. దానిపై స్పెర్మ్ ఉందని నిర్ధారణ అయింది. ఇదే ఈ కేసు బలంగా మారింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ..

ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా నిర్ధారించబడిన సెక్షన్లు వివిధ స్థాయిల శిక్షలు ఖరారు కానున్నాయి. ఐపీసీ సెక్షన్లు 376(2)(k), 376(2)(n) కనీసం పదేళ్ల జైలు శిక్ష పడే ఛాన్సుంది. లేదంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Exit mobile version