NTV Telugu Site icon

BJP Leader: ఇద్దరు లేదా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ పథకాలు కట్.. త్వరలో చట్టం..

Population Control Law

Population Control Law

BJP Leader: జనాభా నియంత్రణ చట్టానికి సంబంధించి రాజస్థాన్ మంత్రి జబర్ సింగ్ ఖర్రా వివాదాస్పద ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని పేర్కొన్నారు. ఆదివారం పాలిలో పర్యటించిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వనరులు తగ్గుతూనే జనాభా పెరుగుతోంది, వివిధ సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. కాబట్టి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉన్న దంపతులు లేదా కుటుంబాలు ఏ ప్రభుత్వాన్ని అందుకోకుండా చూసేందుకు భారత ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన చట్టం త్వరలో దేశంలో వస్తుందని చెప్పడం గమనార్హం.

Read Also: Justice Narasimha Reddy: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కమిషన్ ఛైర్మన్‌గా వైదొలిగా..

రాజస్థాన్ రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ని రూపొందించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల వాగ్ధానాలను నెరవేరుస్తామని చెప్పారు. బీజేపీ ప్రకటన చేయడమే కాదు, వాటిని తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పారు. రాజస్థాన్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని సకాలంలో నెరవేరుస్తామని చెప్పారు.

జనాభా నియంత్రణ చట్టం ఉండాలని జైపూర్ హవా మహల్ బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య కూడా పేర్కొన్నారు. నలుగురు భార్యలు, 36 మంది పిల్లలు ఉండటం ఇకపై ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. బల్ముకుంద్ మాట్లాడుతూ.. దేశానికి ఒకే చట్టం ఉండాలని చాలా ఏళ్లుగా నేను నిరంతరం డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. తాము కాశ్మీర్ సందర్శించినప్పుడు తమని భారతదేశానికి చెందిన వారా.? అని ప్రశ్నించడం బాధకమైందని అన్నారు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు అమలవుతున్నాయని చెప్పారు. పెరుగుతున్న జనభా సమస్యగా మారుతోందని, జనాభా సమతుల్యత దెబ్బతింటోందని, నలుగుర భార్యలు-36 మంది పిల్లలను పోషించే కమ్యూనిటీ ఉందని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇలాంటి వారు ఉన్నారని చ ెప్పారు.