Site icon NTV Telugu

Bike Stunt: మీ రీల్స్ పిచ్చి తగలెయ్య… స్టంట్స్ చేస్తూ బొక్కబోర్ల పడ్డ జంట

Untitled Design

Untitled Design

యువత రీల్స్ కోసం ఎలాంటి స్టంట్స్ చేస్తున్నారో వారికే అర్థం కావడంలేదు. కొందరు ప్రాణలు సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికి వారిలో ఎలాంటి మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Earthquake: ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు

పూర్తి వివరాల్లోకి వెళితే.. రీల్స్ మోజులో పడి స్టంట్స్ చేసిన ఓ జంట ఓ జంట బొక్క బోర్లా పడ్డారు. సింగిల్ టైర్ తో బైక్ నడుపుతూ హల్ చల్ చేశారు. దీంతో కిందపడి బోన్స్ విరగొట్టుకున్నారు. కింద పడిన అమ్మాయిపై మరో బైక్ దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాత్రి వేళ బైక్‌పై నడి రోడ్డు మీద ఓ జంట బైక్ స్టంట్ చేస్తుంది. వెనుక సీటులో కూర్చున్న యువతి, ముందు హ్యాండిల్ పట్టుకున్న యువకుడు రోడ్డు మీద వేగంగా దూసుకెళ్తూ స్టంట్ చేశారు. బైక్ ముందు టైర్‌ను పైకి లేపి స్టంట్ చేస్తుండగా అదుపు తప్పి వాహనం బొక్క బోర్లా పడి పోయింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో బైక్ వీరిపై నుంచి వెళ్లడంతో అది కూడా స్కిడ్ అయింది.

Read Also:Koti Deepotsavam 2025: కోటి దీపోత్సవం వేదికన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణం.. నేడు ప్రత్యేక పూజలు ఇలా..!

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా యువతి కాళ్లపై నుంచి బైక్ వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రీల్స్ కోసం రియల్ లైఫ్‌నే పణంగా పెట్టడం అవసరమా..? అని చాలా మంది నెటిజన్‌లు జంటపై మండిడ్డారు. బైక్ పై స్టంట్స్ చేయడం ఎందుకు..? బొక్క బోర్లా పడి కాళ్లు విరగ్గొట్టుకోవడం ఎందుకని నెటిజన్‌లు ప్రశ్నించారు.వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేశారు.

Exit mobile version