Site icon NTV Telugu

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి అవినీతి సమాజానికి చేసిన నేరమే..

Supreme Court

Supreme Court

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్‌ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరిందన్న కారణంతో మద్రాసు హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుపట్టింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో ఇరుపక్షాల మధ్య సెటిల్మెంట్ ఆధారంగా క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Neeraj Chopra: చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా

హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి.. నిందితులపై క్రిమినల్‌ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆ మొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని.. దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని.. అందువల్ల ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

Exit mobile version