కేరళ రాష్ట్రాన్ని మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. కేరళలో ఒక్క ఆదివారం రోజే 7,167 కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,68,657కి చేరింది. మరోవైపు కొత్తగా 167 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 31,681కి చేరుకుంది. కేరళలో తాజాగా నమోదైన కరోనా కేసులు చూస్తుంటే త్వరలో థర్డ్ వేవ్ ముప్పు ఉందని స్పష్టమవుతోంది. దేశంలో ప్రస్తుతం అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం ఒక్క కేరళ మాత్రమే.
Read Also: ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?
మరోవైపు దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఆదివారం నాడు నమోదైన కరోనా కేసులను చూస్తే.. తమిళనాడులో కొత్తగా 1,009 మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో 385 కరోనా కేసులు, కర్ణాటకలో 292 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒడిశాలో కొత్తగా 488 మందికి కరోనా సోకింది. తెలంగాణలో 121 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా పశ్చిమ బెంగాల్, అసోంలోనూ క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
