Site icon NTV Telugu

దేశంలో 21 శాతం పెరిగిన కరోనా కేసులు..

మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతిచెందారు.

గడిచిన 24 గంటల్లో 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్నటి కరోనా స్థాయితో పోల్చితే నేడు 21 శాతం వరకు కరోనా కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కోవిడ్‌ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించారు. ఢిల్లీ, మహారాష్ట్ర లలో కోవిడ్‌ విజృంభన భారీగా కొనసాగుతోంది.

Exit mobile version