యావత్త ప్రపంచానని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే థర్డ్ వేవ్‌ను సమర్థవంగా ఎదుర్కున్న భారత ప్రభుత్వం.. ఇప్పుడు.. ఫోర్త్ వేవ్ వచ్చిన భయం లేదంటోంది. అయితే గత 24 గంటల్లో 4.77 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 2,364 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,582 మంది కరోనా నుంచి కోలుకోగా… 10 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4.31 కోట్లను దాటింది. 4.26 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,303 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీ నుంచి 532 కేసులు వచ్చాయి. కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్ లో 139 కేసులు నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా, క్రియాశీల రేటు 0.04 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 1,91,79,96,905 డోసుల వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 13,71,603 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.