NTV Telugu Site icon

Corbevax: కార్బెవాక్స్ బూస్టర్ డోస్ కు ఆమోదం.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్నా కూడా..

Corbevax

Corbevax

Corbevax approved as precaution dose for adults: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమలో మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. బయోటాజికల్ ఇ సంస్థ తయారు చేసిన ‘కార్బెవాక్స్’ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికి బూస్టర్ డోస్ గా కార్బెవాక్స్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రాథమికంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కార్బెవాక్స్ ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని వెల్లడించింది. ఇలా మొదటగా ఓ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత బూస్టర్ డోస్ గా మరో వ్యాక్సిన్ సిఫారసు చేయడం ఇదే తొలిసారి.

నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్( ఎన్టీఏజీఐ) కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్బెవాక్స్ వ్యాక్సిన్ కు బూస్టర్ డోస్ అనుమతులను ఇచ్చింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నవారు ఆరు నెలులు లేదా 26 వారాలు పూర్తి చేసుకున్న వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవచ్చు. ఈ కాల పరిమితి పూర్తయిన తర్వాతే బూస్టర్ డోస్ గా కార్బెవాక్స్ ను తీసుకోవచ్చు.

Read Also: Telangana: ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని చెరువులో దూకిన యువతి.. తరువాత

ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్బెవాక్స్ కోవిడ్ టీకాను 12-18 ఏళ్ల వయసున్న వారికి అత్యవసర వినియోగ అనుమతిని డీజీసీఐ ఆమోదించింది. జూన్ 4, 2022లో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా( డీజీసీఐ) కార్బెవాక్ వ్యాక్సిన్ 18 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయస్సున్న వారికి ప్రికాషనరీ డోస్ గా ఇవ్వచ్చని అనుమతి ఇచ్చింది. కార్బెవాక్స్ వ్యాక్సిన్ భారత దేశం మొదటిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రిసెప్టర్ బైండింగ్ డొమైన్ (ఆర్బీడీ) ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. ప్రస్తుతం దేశంలో 207 కోట్ల వ్యాక్సిన్ డోసులును ఇచ్చారు.