Site icon NTV Telugu

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు కేజీఎఫ్-2 కష్టాలు.. రాహుల్‌పై కాపీరైట్ కేసు నమోదు

Bharath Jodo Yatra Kgf 2

Bharath Jodo Yatra Kgf 2

Bharat Jodo Yatra:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాందీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో మంచి జోష్‌ నింపుతూ ముందుకు సాగుతోంది. యాత్రకు ఇలాంటి సమయంలో కేజీఎఫ్‌-2 చిక్కులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాటే, జైరాం రమేష్‌లపై కేసు నమోదైంది. పాదయాత్రలో భాగంగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు నేతలు హుషారైన పాటలను ప్లే చేస్తున్న క్రమంలో కేజీఎఫ్‌-2 పాట కూడా వేశారు. ఈసినిమా పాటను వాడుకోవటంపై హక్కులు కలిగిన సంస్థ బెంగళూరుకు చెందిన MRT మ్యూజిక్ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాటే, జైరాం రమేష్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారత్ జోడో యాత్ర కోసం మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి కాంగ్రెస్ అనుమతి లేకుండా నిర్మించిన దక్షిణ భారత సూపర్‌హిట్ చిత్రం KGF 2 నుండి పాటలను ఉపయోగించిందని కంపెనీ పేర్కొంది.

Read also: Sukesh Chandrasekhar: నేను పెద్ద దొంగను అయితే కేజ్రీవాల్ “మహా దొంగ”.. రూ. 500 కోట్లు తీసుకురావాలంటూ బలవంతం..

హిందీలో KGF 2లోని పాటలపై హక్కులను పొందడానికి చాలా డబ్బు ఖర్చు చేసిందని MRT మ్యూజిక్ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాహుల్‌ గాంధీతో సహా ఇతర నేతలపై కేసు నమోదయ్యింది. పాటల బ్యాక్‌ గ్రౌండ్‌తో పలు వీడియోలు కూడా రూపిందిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మార్టీ మ్యూజిక్‌ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలు నేతలపై ఐటీ లా ప్రకారం IPCలోని సెక్షన్ 403 (నిజాయితీ లేని ఆస్థిని దుర్వినియోగం చేయడం), 465 (ఫోర్జరీకి శిక్ష), 120 (జైలు శిక్షతో కూడిన నేరం చేసేలా డిజైన్‌ను దాచిపెట్టడం), 34 (సాధారణ ఉద్దేశం) సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66, కాపీరైట్ చట్టం, 1957లోని సెక్షన్ 63 ప్రకారం, ముగ్గురు కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. “KGF – చాప్టర్ 2 చిత్రానికి సంబంధించిన పాటలను చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్ చేసి, సమకాలీకరించడం, ప్రసారం చేయడం ద్వారా INC ఒక వీడియోను రూపొందించింది. దానిని హిందీలో INC యాజమాన్యంలో ఉన్నట్లు చిత్రీకరించింది. వారు ‘భారత్ జోడో యాత్ర’ అనే లోగోను కూడా ఉపయోగించారని పేర్కొంది.

రాహుల్ పాదయాత్రలో కాపీరైట్ పడిన kGF-2 సాంగ్ ఇదే…

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ లో ఫుల్‌ జోష్‌ వచ్చింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కల్చరల్‌ప్రోగ్రాంలను నిర్వహిస్తూ.. నేతలు కూడా అందులో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ హుషారుగా యాత్ర ముందుకు తీసుకెళ్తున్నారు. వేదికలపై తాజాగా సీనియర్‌ నేత వీహెచ్‌ సహా పలువురు నేతలు డ్యాన్సులు కూడా చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నవేళ ఊహించని రీతిలో కేజీఎఫ్-2 రీతిలో కాపీ రైట్‌ కింద కేసు నమోదు కావడంపై కార్యకర్తలు కాస్త నిరుత్సాహాన్ని గురుచేస్తోంది. మరి రాహుల్‌ పాదయాత్రకు కేజీఎఫ్‌-2 కష్టాలు ఎప్పుడు తీరనున్నాయో?
President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి

Exit mobile version