Site icon NTV Telugu

Haryana: హర్యానాలో విషాదం.. కుప్పకూలిన స్వింగ్..

Haryana

Haryana

Haryana: హర్యానాలో విషాదకరమైన ఘటన జరిగింది. ఫరరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ మేళాలో స్వింగ్ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, 13 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి ఒక పోలీస్. సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో దాదాపుగా 15 మంది ఊయలలో ఉన్నప్పుడు, యాంత్రిక లోపం కారణంగా విరిగిపోయింది.

Read Also: ధురంధర్ బ్యూటీ సారా అర్జున్: సారీలో గ్రేస్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్!

ఊయల కూలిపోయిన వెంటనే, ఆ ప్రదేశాన్ని అధికారులు ఖాళీ చేయించారు. జిల్లా కలెక్టర్, ఆయుష్ సిన్హా సహాయక చర్యలకు ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ మరణించిన పోలీసుకు సంతాపాన్ని ప్రకటించారు. సూరజ్‌కుండ్ మేళా జనవరి 31న ప్రారంభమైంది మరియు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది.

Exit mobile version