ఎవరి టైం ఎప్పుడు మారుతుందో తెలియదు. రోజూ తినడానికి తిండిలేని వారు ఒక్కరాత్రిలో కుబేరులైన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇక్కడ మనకు మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మమ్మికా అనే వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన వయసు 60 సంవత్సరాలు. అయితే మమ్మికా రోజూ కూలీ పనిచేసుకొని జీవిస్తున్నాడు. అలాంటి మమ్మికా జీవితంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఓ రోజు మమ్మకా రోడ్డుపై నడుచుకుంటు వెళుతుండగా షరీక్ వయలిల్ అనే ఫోటోగ్రాఫర్ చూశాడు. దీంతో మమ్మికా దగ్గరుకు షరీక్ వెళ్లి ఫోటో షూట్ చేస్తానని చెప్పడంతో.. నవ్వుతూ.. నాతో జోక్స్ ఎంటీబాబు.. అని వెళ్లిపోతుంటే.. వెంటపడి మరీ మమ్మికాను షరీక్ ఒప్పించాడు. ఇంకేముందు.. మమ్మికాను సెలూన్‌కు తీసుకువెళ్లి స్టైలిష్‌గా రెడీ చేశారు. సూటు, బూటు వేసి అందగాడిలా.. ఇది నేనేనా అని మమ్మికా అనుకునేలా తయారు చేశారు. ఆ తరువాత మమ్మికా ఫోటోషూట్ తరువాత షరీక్ ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫోటోలో తెగ వైరల్‌గా మారాయి. మీరూ ఓ లుక్కేయండి మరీ..
WOW : నిన్న కూలీ.. నేడు మోడల్.. నెట్టింట రచ్చరచ్చ..
