Site icon NTV Telugu

Tamilnadu: నాకు 5 యావజ్జీవ శిక్షలు విధించండి యువరానర్‌.. కోర్టులో హత్యకేసు దోషి కేకలు

Court

Court

Tamilnadu: న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుండగా ఓ వ్యక్తి కోర్టులోనే కేకలు వేశాడు. తాను చేసిన తప్పుకు తనకు ఒకటి కాదు ఐదు యావజ్జీవ శిక్షలు విధించాలంటూ ఓ హత్యకేసు దోషి న్యాయమూర్తిని ప్రాధేయపడ్డాడు. ఆ దోషి కోర్టులోనే కేకలు వేసిన ఘటన తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. జిల్లాలో అరవంగాల్‌పట్టి గ్రామానికి చెందిన మురుగేశన్(42) తన భార్య శకుంతలను రెండేళ్ల క్రితం గొంతు నులిమి హత్య చేశారు.

Mexican Couple: భారత సంస్కృతిపై అభిమానం.. తాజ్‌ సాక్షిగా హిందూ సంప్రదాయంలో ఒక్కటైన మెక్సికన్ జంట

పోలీసుల సాక్ష్యాధారాల మేరకు పుదుకొట్టై జిల్లా కోర్టు తుది తీర్పు వెలువరించింది. మురుగేశన్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు. అయితే న్యాయాధికారి తీర్పు చెబుతుండగానే.. మురుగేశన్‌ తనకు కనీసం ఐదు యావజ్జీవ కారాగారశిక్షలు విధించాలంటూ కేకలేశాడు. తాను చేసిన తప్పుకు అదే సరైన శిక్ష అంటూ మొరపెట్టుకున్నాడు. అది విన్న న్యాయమూర్తి.. అలా కుదరదని కేసు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుందని బదులిచ్చారు.

Exit mobile version