Site icon NTV Telugu

Rahul Gandhi: “ఇది పట్టాభిషేకం”.. కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ప్రధాన మంత్రి కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కొద్ది సేపటి తర్వాత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ‘‘ పట్టాభిషేక వేడుక’’లా పరిగణిస్తున్నామని అన్నారు. పార్లమెంట్ ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీల వంటి 20 విపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ ను ప్రారంభం చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీలన్నీ ఈ రోజు జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదు. అంతకుముందు కూడా పార్లమెంట్ గురించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ అహం అనే ఇటుకలతో నిర్మించబడదని, రాజ్యాంగ విలువలపైనే నిర్మితమవుతుందని విమర్శించారు.

Read Also: Lakshmi Parvathi: ఎన్టీఆర్‌ నిజమైన వారసుడు ఆయనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ భవనాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ శవపేటికతో పోల్చింది. అయితే దీనికి బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని కూడా ప్రజలు ఇలాంటి శవపేటికలోనే బొందపెడతారని విమర్శించింది. ఆర్జేడీ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మండిపడ్డారు. ఆర్జేడీకి ఓ స్టాండ్ లేదని.. అయితే కొత్త పార్లమెంట్ ను స్పీకర్ ప్రారంభిచాల్సి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ క్లియరెన్స్ కూడా లేదని, కొత్త పార్లమెంట్ ను శవపేటిక అని ఆర్జేడీ ఎలా పిలుస్తుందని మండిపడ్డారు.

Exit mobile version