Site icon NTV Telugu

Wayanad landslides: వయనాడ్ బాధితులకు రూ.15 కోట్లు సాయం ప్రకటించిన సుకేష్ చంద్రశేఖర్‌

Sukeshchandrasekhar

Sukeshchandrasekhar

వయనాడ్ బాధితుల కోసం చీటింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌ భారీ సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్‌కు చంద్రశేఖర్ లేఖ రాశాడు. అంతేకాకుండా బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300 ఇళ్ళు నిర్మించడానికి మరింత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుకేష్ తన లేఖలో పేర్కొన్నాడు.

చట్టబద్ధమైన వ్యాపార ఖాతాల నుంచి సహకారం అందిస్తున్నట్లు చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఆఫర్‌ను అంగీకరించి కొండచరియలు విరిగిపడిన విషాదంలో ప్రభావితమైన వారి సంక్షేమం, పునరావాసం కోసం దీనిని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

వయనాడ్ విలయంలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కేరళకు అండగా నిలిచారు.

Exit mobile version