Site icon NTV Telugu

Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దించి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

Pawan Khera

Pawan Khera

Pawan Khera Arrest: కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాని విమానం నుంచి దింపేసిన తర్వాత అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు వెళ్లేందుకు బయలుదేరిన పవన్ ఖేరాను విమానం నుంచి దింపేశారు అధికారులు. పార్టీ నేతలతో కలిసి విమానం ఎక్కిన కొద్ది సేపటికే ఆయనను అధికారులు అడ్డగించారు. రాయ్ పూర్ లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి ఆయన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Read Also: Supreme Court : అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా

అరెస్ట్ వారెంట్ లేకుండానే పవన్ ఖేరాను ఆపారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ కావాలనే కాంగ్రెస్ నేతలపై బలప్రయోగం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పవన్ ఖేరాను ఢిల్లీ-రాయ్‌పూర్ ఫ్లైట్ నుండి దింపి, ఏఐసిసి ప్లీనరీకి రాకుండా చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం గూండాల వ్యవహరిస్తోందని, అతడిని అడ్డుకోవడం సిగ్గు చేటని, పార్టీ మొత్తం పవన్ ఖేరాకు అండగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ముందుగా ఈడీని చత్తీస్ గఢ్ పంపారని, ఇప్పుడు కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న పవన్ ఖేరాను ఫ్లైట్ ఎక్కకుండా ఆపారని.. ఈ నియంతృత్వాన్ని అస్సలు సహించమని.. పోరాడి గెలుస్తామని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

అస్సాం పోలీసుల విజ్ఞప్తి మేరకు పవన్ ఖేరాను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారనే ఆరోపణలపై ఖేరాను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల విలేకరులు సమావేశంలో అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరపాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్ పేయిలు జేపీసీని ఏర్పాటు చేయగలిగితే.. ప్రధాని ‘‘నరేంద్ర గౌతమ్ దాస్’’.. సారీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఏ సమస్య వచ్చిందని ప్రశ్నించారు.

Exit mobile version