Site icon NTV Telugu

Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనొద్దని కాంగ్రెస్ నిర్ణయం..

Pawan Khera

Pawan Khera

Lok Sabha Exit Polls: లోక్‌సభ ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నాయి. రేపు జరిగే చివరిదైన ఏడో దశలో ముగియనున్నాయి. గత రెండు నెలలుగా సాగిన సుదీర్ఘ ప్రక్రియ భారతదేశంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారో తేల్చనుంది. రేపు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, ప్రతిపక్షాల ఇండియా కూటమిలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనే విషయంపై కాస్త స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల తర్వాత దేశంలో ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నాయి.

Read Also: India GDP 2024: 8.2 శాతానికి చేరుకున్న భారత జీడీపీ వార్షిక వృద్ధిరేటు..

ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. టీఆర్పీల కోసం ఊగాహానాల్లో మునిగిపోకూడదని తెలిపింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మీడియా విభాగం చైర్‌పర్సన్ పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారని, వారి తీర్పు ఖాయమైందని చెప్పారు.

‘‘జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దానికి ముందు, TRP కోసం ఊహాగానాలు మరియు స్లగ్‌ఫెస్ట్‌లో మునిగిపోవడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. భారత జాతీయ కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్‌పై చర్చలలో పాల్గొనదు. ఏదైనా చర్చ యొక్క ఉద్దేశ్యం ప్రజలకు తెలియజేయడమే. మేము జూన్ 4 నుండి చర్చలలో సంతోషంగా పాల్గొంటాము’’ అని పవన్ ఖేరా ఓ ప్రకటనలో తెలియజేశారు. పార్టీలో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Exit mobile version