Rajnath Singh: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ‘‘బాబ్రీ మసీదు’’ను తిరిగి నిర్మించేందుకు ప్రజా ధనాన్ని ఉపయోగించాలని అనుకున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. నెహ్రూ, సర్దార్ పటేల్ మధ్య స్నేహం ఉందని చెబుతూ, మతపరమైన స్థలాల నిర్మాణానికి ప్రజా నిధులను ఎప్పుడూ ఉపయోగించకూడదని నెహ్రూ నిర్ణయించుకున్నారని ఎంపీ చెప్పారు.
యూనిటీ మార్చ్‌లో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ప్రజా ధనంతో నిర్మించేందుకు నెహ్రూ సిద్ధమయ్యారని, అయితే సర్దార్ పటేల్ ఆయనను ఆపారని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఐక్యతా యాత్ర కార్యక్రమంలో భాగంగా గుజరాత్‌లోని వడోదరలో నిర్వహించిన ‘సర్దార్ సభ’లో రాజ్‌నాథ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఠాగూర్ మాట్లాడుతూ.. రాజ్ నాథ్ వ్యాఖ్యలు వర్తమానాన్ని విభజించడానికి గతాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. గాడ్సే అనుచరులు, నెహ్రూ-పటేల్ వారసత్వాన్ని వక్రీకరించడానికి తాము అనుమతించమని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు?
‘‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా లౌకక వ్యక్తి. ఆయన ఎప్పుడు బుజ్జగింపులనున నమ్మలేదని, బాబ్రీ మసీదు సమస్యపై ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం గురించి నెహ్రూ మాట్లాడినప్పుడు సర్దార్ పటేల్ దానిని వ్యతిరేకించారు’’ అని అన్నారు. ఆ సమయంలో బాబ్రీ మసీదును ప్రభుత్వ డబ్బుతో నిర్మించడానికి అనుమతించలేదని చెప్పారు. గిర్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మానాన్ని ప్రభుత్వ డబ్బుతో కాకుండా విరాళాలతో నిర్మించారని కేంద్ర మంత్రి అన్నారు.
‘‘సోమనాథ్ ఆలయ పునర్మిర్మాణం గురించి నెహ్రూ ప్రశ్నల్ని లెవనెత్తారు. సోమనాధ్ ఆలయం కేసు భిన్నంగా ఉందని, ప్రజలు రూ. 30 లక్షల విరాళం ఇచ్చారని, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారని, ప్రభుత్వ డబ్బులో ఒక్క పైపా కూడా ఉపయోగించలేదని సర్దార్ స్పష్టం చేశారు’’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
