NTV Telugu Site icon

Congress Plenary Session: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు.. బీజేపీని ఓడించడమే లక్ష్యం

Congress Plenary Session

Congress Plenary Session

Congress Plenary Session From Feb 24 To Feb 26 In Raipur: కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు.. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి 9915 మంది పీసీసీ ప్రతినిధులు, 1338 మంది ఏఐసీసీ ప్రతినిధులు, 487 కోఆప్టెడ్ సభ్యులు పాల్గొననున్నారు. అందులో ఏపీ నుంచి 350, తెలంగాణ నుంచి 238 పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారు.

Stalled Wedding: కొన్ని నిమిషాల్లో పెళ్లి.. నో చెప్పిన వరుడు.. అసలేం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. 12 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు నిర్వహించే అంశంపై ఫిబ్రవరి 24న తొలిరోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. మూడు రోజుల ప్లీనరీ సమావేశాల అజెండాను కూడా స్టీరింగ్ కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కమిటీ.. ప్లీనరీ సమావేశాల్లో ఆమోదించనున్న తీర్మానాలకు తుది రూపునివ్వనుంది. చివరి రోజు (ఫిబ్రవరి 26)న నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సభలో అగ్రనేతలు ప్రసంగించనున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే ఏఐసీసీ ప్రతినిధుల్లో 235 మంది మహిళా ప్రతినిధులు కాగా, మరో 501 మంది ప్రతినిధులు 50 ఏళ్ళలోపు వయసున్నవారు ఉన్నారు.

Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చర్చించనుంది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చిస్తామని తెలిపిన కాంగ్రెస్.. తమ పార్టీ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత విజయవంతం కాదని ప్రకటించింది. బిజేపిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తోంది. 2024 లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అధికారం నుంచి బిజెపిని తొలగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రకటనను స్వాగతించిన కాంగ్రెస్.. భారత రాజకీయాలు సమూల మార్పు చెందే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని నితీష్ గ్రహించారని, నితీష్ కుమార్ సూచనను స్వాగతిస్తున్నామని తెలిపింది. దేశ రాజకీయాల్లో తమ పాత్రేంటో తమకు స్పష్టంగా తెలుసుని పేర్కొంది.

Tamilisai Soundararajan: నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని తెలిపిన కాంగ్రెస్.. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలా? లేదా ఏ రకంగా పొత్తులు, అవగాహనలు ఉండాలో ప్లీనరీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించే విషయంలో, ప్రతిపక్షాల ఐక్యత విషయంలో రెండు నాలుకల ధోరణిని అవలంబించదని స్పష్టం చేసింది. ఆదాని వివాదం, వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని చెప్పింది. ఈ ప్లీనరీ సమావేశాలు చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతాయని కాంగ్రెస్ ప్రకటించింది. కాగా.. 2005లో హైదరాబాదులో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెలుపల రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు.

Show comments