Site icon NTV Telugu

రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌

దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్‌ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్‌ అభియాన్‌’ పేరుతో కాంగ్రెస్‌ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్‌ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది.. ఈ ర్యాలీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఏఐసీసీ కార్యనిర్వాహక వర్గం, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు. ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ పార్టీ.. చివరకు దేశ రాజధాని కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.

Exit mobile version