Site icon NTV Telugu

Bihar: ఓ కాంగ్రెస్ ఎంపీ ఓవరాక్షన్.. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి వరదలు పరిశీలన.. వీడియో వైరల్

Biharcongrssmp

Biharcongrssmp

ప్రజాప్రతినిధి అంటేనే ప్రజలకు సేవ చేసేవాడు. అది మరిచిపోయిన ఓ నేత.. ప్రజల చేతనే పని చేయించుకున్నాడు. బీహార్‌లో వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఓ కాంగ్రెస్ ఎంపీ చాలా ఓవరాక్షన్ చేశారు. గ్రామస్తుడి భుజంపైకి ఎక్కి వరద ప్రాంతాలను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rekha Gupta-AAP: ప్రభుత్వ సమీక్షలకు సీఎం రేఖా గుప్తా భర్త హాజరు.. ఆప్ తీవ్ర విమర్శలు

బీహార్‌లోని కతిహార్‌లో వరద ముంచెత్తింది. అయితే ఆ ప్రాంతాన్ని పరిశీలించేందు కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ వచ్చారు. వరద ప్రాంతాల్లో బురద ఉండడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో గ్రామస్తులు ఎంపీని భుజంపైకి ఎక్కించుకుని పొలం గట్లు అన్ని తిప్పి చూపించారు. ఒక వ్యక్తే చాలా సేపు భుజంపైకి ఎక్కించుకుని తిప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దుమారం చెలరేగింది.

ఇది కూడా చదవండి: AP Onion Market: రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తున్న ఉల్లి సాగు.. ధర లేక రోడ్డెక్కిన అన్నదాతలు

ఎంపీ అనారోగ్యంతో ఉండడంతోనే గ్రామస్తులు స్వయంగా భుజంపైకి ఎక్కించుకుని తీసుకెళ్లారని కతిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ తెలిపారు. అంతకముందు ట్రాక్టర్‌, పడవ, బైక్‌పై తిరిగారని.. ట్రక్కు బురదలో కూరుకుపోవడంతో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఎంపీ తల తిరుగుతోందని చెప్పగానే గ్రామస్తులే ప్రేమతో భుజంపైకి ఎక్కించుకున్నారని చెప్పుకొచ్చారు.

ఇటీవల బీహార్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో గంగా, కోసి, గండక్, ఘాగ్రా నదులకు తీవ్ర వరదకు గురయ్యాయి. దీంతో లక్షలాది మంది ప్రజలు వరద ముప్పునకు గురయ్యారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో నాయకుల ప్రవర్తన కారణంగా పార్టీ డ్యామేజ్ అవుతుంటుంది.

 

 

Exit mobile version