Karti Chidambaram: అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇండియా చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అన్నారు. అలాగే, భారత్ వారానికి ఐదు రోజుల పని దినాలు ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై నాకు నమ్మకం లేదని ఆయన వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. సుదీర్ఘంగా పని చేయాలని చెప్పడం అర్థరహితమన్నారు.
Read Also: Sambhal: యూపీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. తీర్థయాత్రా స్థలంగా సంభాల్!
ఇక, నారాయణమూర్తి పని రోజుల కంటే సమర్థతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం తెలిపారు. మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా కొనసాగుతుంది.. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మనం వారానికి 4 రోజుల పని దినాలకు మారిపోవాలని డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ ముగించాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం తెలిపారు.